Skip to main content

తెలంగాణ సేవా భారతి ఆధ్వర్యంలో కిషోర్‌ వికాస్‌ బాలిక సాధికారతపై అవగాహన కల్పించేందుకు: రన్ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌



హైదరాబాద్ : తెలంగాణ సేవా భారతి ఆధ్వర్యంలో కిషోర్‌ వికాస్‌ బాలిక సాధికారతపై అవగాహన కల్పించేందుకు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద జరిగిన రన్‌ ఫర్‌ గార్ల్‌ చైల్డ్‌కు అనూహ్య స్పందన లభించింది. 5కె, 10కె రన్‌ను ప్రిన్సిపల్‌ సెక్రటరీ వినోద్‌ అగర్వాల్‌, క్యాప్‌ జెమిని ఇండియా హెడ్‌ దయాకర్‌రెడ్డి, సీఐఐ చైర్మన్‌ వనిత, ఉమెన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ రుచిక, సేవా భారతి అధ్యక్షుడు రఘునాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు. చిన్నా, పెద్దా కలిపి దాదాపు 5వేల మంది రనలో పాల్గొన్నారు. 5కె రన్‌ మైక్రోసాఫ్ట్‌ గేట్‌ వరకు, 10కె రన్‌ ఫైనాన్షియల్‌ డిసి్ట్రక్‌ వరకు సాగి తిరిగి స్టేడియానికి చేరుకున్నాయి. కిషోరి వికాస్‌ కేంద్రాల ద్వారా మురికివాడల్లో జీవించే బాలికలు, పేదరికంలో ఉండే వారికి సహకారం అందించేందుకు ఈ రన్‌ నిర్వహించినట్లు రఘునాథ్‌ తెలిపారు. హైటెక్‌సిటీకి చెందిన దివ్యాంగుడు నరసింహ 5కె రన్‌లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు

Source http://www.prajasakti.com/Article/BreakingNews/1886850

Comments

  1. Another informative blog… Thank you for sharing it… Best of luck for further endeavor too. For more information visit k2 spice

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సేవాభారతి కిశోరి వికాస్ వార్షికోత్సవం : Kishori Vikas Bhainsa

May 11 2016
సేవాభారతి కిశోరి వికాస్ వార్షికోత్సవం ఈరోజు సాయంత్రం AP nagar mahisha లో జరిగింది .రామకృష్ణ సేవ సంఘం (వివేకానంద ఆవాసం మహిష ) ద్వారా ఇక్కడ బాల సంస్కర కేంద్రం నడుస్తుంది భాగ్యనగరం నుండి 4 గురు బాలికలు 7 రోజులు ఇక్కడి పిల్లలకు డాన్సు ,పాటలు ,అల్లికలు నేర్పినారు .ఈరోజు ఇక్కడ చక్కని దేశభక్తి .బతుకమ్మ కోలాటాలతో ఆకట్టుకొన్నారు .కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమతి రాణి చందూలాల్ గారు వక్తగా శ్రీ నారాయణ్ సార్ పాల్గొన్నారు





Kishori vikasa kendram, Mancheriyal garmilla basthi

Kishori vikasa kendram, Mancheriyal garmilla basthi.20 members attend. 

2 Graduate student volunteers are running the programme as a summer internship


Photos : Kishori Vikas centers Bala Samskara kendras

Kishori Vikas centers run Bala Samskara kendras